ఫించ్ అరుదైన రికార్డు..

84
finch

సిడ్నీ వేదికగా భార‌త్‌తో జ‌రుగుతున్న తొలి వ‌న్డేలో ఆసీస్ ఓపెనర్లు అద్భుతంగా రాణించారు. డేవిడ్ వార్న‌ర్‌, ఆర‌న్ ఫించ్‌లు హాఫ్ సెంచ‌రీల‌తో అదరగొట్టగా భారీ స్కోరు దిశగా ఆసీస్ దూసుకెళ్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేయడంతో ఫించ్‌ వ‌న్డేల్లో 5వేల ర‌న్స్ మైలుదాయిని దాటగా ఓవరాల్‌గా 31వ హాఫ్ సెంచ‌రీ.

ఆస్ట్రేలియా తరఫున వేగంగా ఐదు వేల రన్స్ చేసిన రెండో ఆటగాడు ఫించ్ కావడం గమనార్హం. ఫించ్‌ 126 ఇన్నింగ్స్‌ల్లో 5 వేల రన్స్ మైలురాయిని అందుకున్నాడు. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 115 ఇన్నింగ్స్‌ల్లోనే ఐదు వేల పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా తరఫున రిక్కీ పాంటింగ్ (364 ఇన్నింగ్స్‌ల్లో 13,589 రన్స్) టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.