సందీప్ మాధ‌వ్ హీరోగా రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌

194
sandeep
- Advertisement -

‘వంగ‌వీటి’, ‘జార్జి రెడ్డి’ లాంటి బ‌యోపిక్‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన యువ న‌టుడు సందీప్ మాధ‌వ్‌, ఈసారి ఒక స‌రికొత్త రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌తో మ‌న ముందుకు రానున్నారు.

హ‌ల్సియ‌న్ మూవీ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నంబ‌ర్ 1గా సినిమాటోగ్రాఫ‌ర్ అరుణ్ కుమార్ సూర‌ప‌నేని నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్దుకోనున్న‌ది.ఈ మూవీతో జె.వి. మ‌ధుకిర‌ణ్ ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఆయ‌న గ‌తంలో డైరెక్ట‌ర్ కె.ఎస్‌. ర‌వీంద్ర (బాబీ) రూపొందించిన చిత్రాల‌తో పాటు ప‌లు చిత్రాల‌కు ర‌చ‌యిత‌గా ప‌నిచేశారు.

అలానే ఈ చిత్రంలో ఒక పవర్‌ఫుల్ రోల్‌లో ప్రముఖనటుడు నటించబోతున్నారు.ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర‌ నిర్మాత తెలియచేశారు.

- Advertisement -