వైట్ హౌస్‌ నుండి వెళ్లిపోతా: ట్రంప్

291
trump
- Advertisement -

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమిని అంగీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌ను విజేతగా ఎలక్టోరల్‌ కాలేజీ అధికారికంగా ధ్రువీకరిస్తే తాను వైట్‌హౌస్‌ నుంచి తప్పుకొని వెళ్లిపోతానని ప్రకటించారు ట్రంప్‌.

తొలిసారి మీడియాతో మాట్లాడిన ట్రంప్‌….. బైడెన్‌ విజయాన్ని ధ్రువీకరిస్తే వైట్‌హౌస్‌ నుంచి వెళ్లిపోతారా? అని ప్రశ్నించగా.. తప్పకుండా చేస్తాను.. ఆ విషయం నీకు తెలుసా? అన్నారు. కానీ, అలా చేసినట్లయితే వారు తప్పు చేసినట్లే.. అంగీకరించానికి చాలా కష్టం అన్నారు. ప్రస్తుతం (జనవరి) 20వ తేదీ మధ్య చాలా విషయాలు జరగవచ్చని నేను భావిస్తున్నాను అని పేర్కొన్నారు. ఎలక్టోరల్ ఓట్లలో ట్రంప్‌కు 232 ఓట్లు రాగా బిడెన్‌కు 306 ఓట్లు వచ్చిన సంగతి తెలిసిందే.

- Advertisement -