‘రాయన్’ ..సందీప్ కిషన్‌ లుక్

6
- Advertisement -

నేషనల్ అవార్డ్ విన్నర్ సూపర్ స్టార్ ధనుష్ ల్యాండ్‌మార్క్ 50వ చిత్రం’ రాయన్‌’ లో సందీప్ కిషన్, అపర్ణ బాలమురుగన్ మెయిన్ లీడ్ లో ఒకరుగా కనిపించనున్నారు. ఫస్ట్ సింగిల్‌తో మాస్ ట్రీట్ అందించిన తర్వాత ఈ యాక్షన్ థ్రిల్లర్ మేకర్స్ సందీప్ కిషన్, అపర్ణ బాలమురుగన్‌ నటించిన ఫుట్-ట్యాపింగ్ మెలోడీని విడుదల చేశారు.

ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ AR రెహమాన్ కాంట్రాస్ట్ ట్యూన్ చేశారు. ఇది గ్రూవీ బీట్‌లతో కూడిన రొమాంటిక్ మెలోడీ. ఇది స్లో పాయిజన్ లాగా ఇంజెక్ట్ అవుతుంది. సందీప్ కిషన్, అపర్ణ బాలమురుగన్ స్టీమీ రొమాన్స్ తో కూడిన ఈ పాటని విజయ్ ప్రకాష్ హరిప్రియ పాడిన తీరు మరింత స్పైసీ ని జోడించింది. రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం ఒకరికొకరు ప్రధాన జంట యొక్క రోమాన్స్ ని ఆకర్షణీయంగా వర్ణించింది. సందీప్ కిషన్ కి ఇది మరో చార్ట్ బస్టర్ సాంగ్.

రాయన్ కోసం ధనుష్ రెండోసారి మెగాఫోన్ పట్టారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాళిదాస్ జయరామ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. SJ సూర్య, సెల్వరాఘవన్, దుషార విజయన్ ఇతర ముఖ్య తారాగణం.

ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, ఓం ప్రకాష్ కెమెరా హ్యాండిల్ చేస్తున్నారు. ప్రసన్న జికె ఎడిటర్, జాకీ ప్రొడక్షన్ డిజైనర్‌గా, పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.జూన్ 13న రాయన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి తెలుగు వెర్షన్‌ను విడుదల చేయనుంది.

Also Read:లవ్ మీ..అద్భుతమైన రెస్పాన్స్

- Advertisement -