ఐపీఎల్ విజేతగా కోల్‌కతా

30
- Advertisement -

ఐపీఎల్ 2024 విజేతగా నిలిచింది కోల్ కతా. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్‌ చిత్తుగా ఓడిపోయింది. భారీ అంచనాల మధ్య బరిలో దిగిన హైదరాబాద్ పేలవ ప్రదర్శనతో నిరాశ పర్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ కేవలం 113 పరుగులకే ఆలౌట్ అయింది.

114 పరుగుల స్వల్ప చేధనలో బరిలోకి దిగిన కోల్ కతా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వెంక‌టేశ్ అయ్య‌ర్(52 నాటౌట్)గా నిలిచి కోల్ కతా విజయంలో కీలక పాత్ర పోషించగా ర‌హ్మ‌నుల్లా గుర్బాజ్(39) పరుగులు చేశారు.

అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 19 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌట్ అయింది.అభిషేక్ శ‌ర్మ‌(2), ట్రావిస్ హెడ్(0), మ‌ర్కమ్(20), హెన్రిచ్ క్లాసెన్‌(16) , క్లాసెన్ 24 పరుగులు చేశారు. గౌతం గంభీర్ కెప్టెన్సీలో 2012, 2014లో టైటిల్ గెలిచిన కోల్‌క‌తా ఇప్పుడు అత‌డు మెంటార్‌గా రాగానే చాంపియ‌న్‌గా నిల‌వ‌డం విశేషం.

Also Read:తేనెతో ఖర్జూర కలిపి తింటే..!

- Advertisement -