జయలలితకు ప్రముఖుల సంతాపం..

89
jayalalitha

తమిళనాడు అమ్మ ఇక లేరు. అమ్మ అని ఆప్యాయంగా పిలుచుకుంటుకున్న తమిళనాడు సీఎం జయలలిత కన్నుమూశారు. దాదాపు 72 రోజుల పాటు అపోలో ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన జయ..చివరకు తుది శ్వాస విడిచారు. ఇక సెలవంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లారు. తమిళనాడు ప్రజలకు..కార్యకర్తలకు..దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులకు అమ్మ శోక సంద్రాన్ని మిగిల్చారు. జయలలిత మృతి పట్ల భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర  దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. దేశం ఒక ధీరవనితను కోల్పోయిందంటూ రాష్ట్ర్రపతి, ప్రధాని జయలలిత సేవలను కొనియాడాడరు. జయలలిత మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జయలలిత పార్ధీవదేహాన్ని సందర్శించేందుకు తమిళనాడుకు వచ్చాడు.

modi-jaya

తమిళనాడు సీఎం జయలలిత మృతి తమిళ సమాజానికి తీరనిలోటని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. జయలలిత ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. జయ మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అమ్మగా, పురచ్చి తలైవిగా అభిమానులు, పార్టీ కార్యకర్తతు అమెను కీర్తించిన విషయాన్ని గుర్తు చేశారు. జయలలిత మరణం తమిళ సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు. జయలలిత రాజకీయ ప్రస్థానం సాహసోపేతమైనదని పేర్కొన్నారు. ఆమె అంచెలంచెలుగా ఎదిగిన విషయాన్ని గుర్తు చేశారు. వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని కొనసాగించడం తమిళ రాజకీయాల్లో గొప్ప విషయమన్నారు. ఆమె తమిళనాట అత్యంత ప్రజాదరణ పొందిన నేత అని కొనియాడారు.

jayalalitha
జయలలిత మృతితో  దిగ్బ్రాంతి చెందిన ప్రముఖులు..అమ్మ సేవలను నేతలు కొనియాడారు. దేశం ఒక ధీరవనితను కోల్పోయిందంటూ అమ్మ స్మృతులను గుర్తుకు చేసుకున్నారు. దేశం ఒక ఆణిముత్యాన్ని..మంచి వ్యక్తిని..రాజకీయ నాయకురాలిని కోల్పోయిందంటూ విచారం తెలియజేస్తున్నారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ జయలలిత మృతిపట్ల నివాళులర్పించారు. దేశరాజకీయాల్లో జయలలిత లేని లోటు తీర్చలేనిదని సోనియాగాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.