ఘనంగా అయ్యప్ప స్వామి లక్షార్చన

116
Ayyappa Laksharchana in Siddi Vinayaka Temple

కాలిఫోర్నియాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సిద్ధి వినాయక టెంపుల్‌ అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోయింది. అయ్యప్ప సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ లక్షార్చన కార్యక్రమం అంగరంగవైభవంగా జరిగింది. వందల సంఖ్యలో అయ్యప్ప స్వాములు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.

మధ్యాహ్నాం ఒంటి గంటకు హోమం..సహస్రనామంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటలకు అయ్యప్ప స్వామికి అభిషేకం…అలంకారం నిర్వహించారు. 5 గంటలకు అయ్యప్ప లక్షార్చర కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి భజనలతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. స్వామి వారికి సుగంధ పరిమళాలను వెదజల్లే పూలను సమర్పిస్తూ లక్షార్చన నిర్వహించారు. చివరగా మహమంగళ హారతితో కార్యక్రమం ముగిసింది. అత్యంత తేజస్సుతో శోభిల్లుతున్న స్వామి వారి దివ్యస్వరూపాన్ని తిలకించడానికి భక్తులు ఎగబడ్డారు.