ఇంటర్నెట్ లేకపోతే మెయిల్స్,ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విటర్ ముఖ్యంగా లక్షల కోట్ల బ్యాంకు లావాదేవీలు స్తంభించిపోతాయి. ఇంటర్నెట్ క్షణకాలం పాటు లేకపోయినా ఊపిరి ఆడనట్లు అనిపిస్తుంది. అలాంటి పరిస్థితే రానున్న 48 గంటల్లో రాబోతుందని రష్యాకు చెందిన ఓ సంస్థ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇంటర్నెట్‌కు సంబంధించి పేర్లను, ఐపీ అడ్ర్‌సలను నియంత్రించే ద ఇంటర్నెట్ కార్పొరేషన్ ఆఫ్ అసైన్‌డ్ నేమ్స్ అండ్ నంబర్స్(ఐసీఏఎన్‌ఎన్) వినియోగదారుల భద్రతరీత్యా ఇంటర్నెట్ క్రిప్టోగ్రఫిక్ కీని మార్చుతోంది. ఈ నేపథ్యంలో 48 గంటల పాటు ఇంటర్‌నెట్ షట్ డౌన్ కానుందని తెలిపింది.
భారత్‌లోనూ దీని ప్రభావం పెద్దగా ఉండదని జాతీయ సైబర్ సెక్యూరిటీ కో ఆర్డినేటర్ గుల్షన్‌రాయ్ తెలిపారు. ఇంటర్నెట్ సేవల్లో ఎలాంటి అవాంతరాలు ఉండవని, యథావిధిగానే పనిచేస్తాయని ఆయన చెప్పారు.
సురక్షితమైన, సుస్థిరమైన డీఎన్‌ఎస్ కోసం కొద్దిసేపు ప్రపంచ నెట్‌వర్క్‌ను షట్‌డౌన్ చేయడం తప్పనిసరని వెల్లడించింది. ఇంటర్నెట్ సేవలకు అంతరాయం నేపథ్యంలో ముఖ్యమైన పనులకు నెటిజన్లు కాస్త విరామం ప్రకటించడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. కేవలం ఒక్క శాతం ఇంటర్నెట్ వినియోగదారులకు మాత్రమే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని వినియోగదారులు భయపడాల్సిన అవసరం లేదని ఐసీఏఎన్‌ఎన్ వెల్లడించింది.