కేటీఆర్‌కు స్టాన్‌పోర్డ్ యూనివర్సీటీ ఆహ్వానం…..

269
STANFORD UNIVERSITY invite By Ktr
- Advertisement -

పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి కేటీ రామారావుకు స్టాన్‌పోర్డ్ యూనివర్సీటీ నుంచి ఆహ్వానం లభించింది. స్టాన్‌పొర్డ్ యూనివర్సీటీ వార్షిక  సదస్సులో  కీలకోపన్యాసం చేయాల్సిందిగా మంత్రిని యూనివర్సీటీ కోరింది.

ఈ ఏడాది మే నెలలో 18-19 తేదిల్లో జరిగే ఈ సమావేశంలో ఉపాది-ఉద్యోగాలు, ఎంటపెన్యూర్ షిప్ అంశాల మీద మంత్రి ప్రసంగించాల్సిందిగా కోరింది. ఐటి రంగంలో గత రెండున్నర సంవత్సరాల్లో తెలంగాణ సాధించిన ప్రగతిని ప్రస్తావిస్తూ, టెక్నాలజీ వినియోగం ద్వారా ఉద్యోగాలను, ఎంటర్ ప్రెన్యూర్ షిప్‌ను ప్రొత్సహించేందుకు ఉన్న అవకాశాలపైన మాట్లాడాలని మంత్రిని కోరారు. ఈ సమావేశానికి స్టాన్‌పొర్డ్ విద్యార్దులు, ప్యాకల్టీతోపాటు వివిధ దేశాల నుంచి పరిశ్రమల ప్రతినిధులు సైతం హజరవుతారని, వీరందరికి తెలంగాణ సాధించిన ప్రగతి ఒక కేస్ స్టడీగా ఉపయోగపడే అవకాశం ఉందని యూనివ్సరీటీ  మంత్రికి పంపిన లేఖలో తెలిపింది.

నూతన భారతదేశానికి ప్రతినిధిగా మంత్రి ఉన్నారంటూ మంత్రికి పంపిన ప్రత్యేక అహ్వనంలో స్టాన్‌పొర్డ్  ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ సెంటర్ డైరెక్టర్ అంజిని కోచ్చార్ తెలిపారు. గత ఎడాది సైతం మంత్రికి స్టాన్‌పొర్డ్ నుంచి  ఆహ్వానం లభించింది. వరుసగా రెండో ఏడాది తనకు అహ్వనం రావడం పట్ల మంత్రి కెటి రామారావు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -