ఈ కోర్సులు చేస్తే..ఉద్యోగాలు గ్యారెంటీ

407
- Advertisement -

భారత దేశంలో విద్య ఒక వ్యాపార ధోరణిలో అమలవుతుంది.ఎల్‌కేజీ నుంచి పీజీ దాకా చదువులు వ్యాపార బాటలోనే నడుస్తున్నాయి. సగటున ప్రతి ఏటా 15 లక్షల మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు కాలేజీల నుండి బయటకు వస్తున్నారు. ఇందులో ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు అంటే అది మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఈ నేపథ్యంలో ఓ సర్వే ఉద్యోగాలకు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఇంజనీరింగ్, మెడిసిన్… ఇవేనా ఉద్యోగాలకు ఉన్న అవకాశాలు? అసలు ఏం చదివితే మంచి ఉద్యోగ అవకాశాలుంటాయి? జీవితంలో మంచి స్థాయికి చేరాలంటే ఏ రంగంపై దృష్టి సారిస్తే మంచిది? అనే దానిపై నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. ఈ సర్వే నివేదిక ప్రకారం… ఐటీ, ఐటీ ఆధారిత సేవలు… దీంతోపాటే టెక్నాలజీ ఎప్పటికీ అప్‌డేట్ అవుతూనే ఉంటుంది. దానికి తగ్గట్లుగానే ఈ రంగంలో నిపుణులకు డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. సమీప భవిష్యత్తులో ఇది ఆగే ప్రశ్నేలేదు.

() మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్

స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన దగ్గరి నుంచి కంప్యూటర్ల వాడకం తగ్గిపోయింది. ఆన్‌ లైన్ షాపింగ్‌లు, సినిమా టిక్కెట్లు ,పేటీఎం ఇలా మొబైల్ యాప్‌లకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. దీంతో మొబైల్ అప్లికేషన్లు రూపొందించేవారికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. సీ, సీ++, జావా, ఆబ్జెక్టివ్ సీ వంటి వాటిపై అనుభవం ఉన్నవారికి అవకాశాలు వెల్లువెత్తుతాయి. సాధారణంగా బీఎస్సీ కంప్యూటర్ సైన్సెస్ లేదా బీటెక్ చదివితే వీటిపై మీకు అవగాహన వస్తుంది. కానీ కాలం మారుతోంది. ఈ కోర్సులను అందించే వివిధ సంస్థలు పుట్టుకొచ్చాయి. నైపుణ్యానికి ఆ సర్టిఫికేషన్ తోడైనా చాలు… ఎన్నో కంపెనీలు కళ్లకద్దుకుని తీసుకుంటున్నాయి.

Also Read:Prabhas:చిరు మాటలు మర్చిపోలేను

()ఈ-లెర్నింగ్

మారుతున్న కాలం,పెరుగుతున్న పోటీకి అనుగుణంగా ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు క్లాస్ రూమ్‌లో కూర్చోని పాఠాలు నేర్చుకునే వాళ్లం. కానీ ప్రస్తుతం ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడి నుంచైనా మారుమూల గ్రామాల వారితో మాట్లాడే అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ-లెర్నింగ్‌ ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది. కళాశాలలు, యూనివర్శిటీలు, ఇతర విద్యా సంస్థలు సైతం ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. మనం ఇంట్లోనుంచే మనకు కావాల్సిన టెక్నాలజీని నేర్చుకోవడం లేదా టీచింగ్ చేయడం చేయవచ్చు. అందువల్ల ఈ రంగంలో కూడా ఉపాధికి లోటుండదు. మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకుంటూ ఉంటే భవిష్యత్‌లో మంచి స్థాయిలో స్థిరపడేందుకు అవకాశాలుంటాయి.

6 Courses Help for Getting a Job

()డేటా అనలిటిక్స్

ప్రతి 12-15 నెలలకోసారి ప్రపంచం మొత్తం ఉపయోగిస్తున్న డేటా రెట్టింపు అవుతోంది అని ఇటీవల ఓ అంతర్జాతీయ సర్వే నివేదిక వెల్లడించింది. ఈ డేటా మొత్తాన్ని విశ్లేషించడం, అవసరమైనట్లుగా నివేదికలు రూపొందించుకోవడం, వాటితో లాభనష్టాలను అంచనా వేసుకోవడం… ఇలాంటివి చేయగలిగేవారికి అవకాశాలు పెరుగుతాయి. గణితశాస్త్రం చదివినవారికి ఈ రంగంలో మరింత రాణించే అవకాశం ఉంది.

()డిజిటల్ మార్కెటింగ్

ప్రస్తుతం మార్కెట్‌లో డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్ నడుస్తోంది. కంపెనీ చిన్నదా పెద్దదా అనేదానితో సంబంధం లేదు… మీ ప్రొడక్ట్‌ను అమ్ముకోవాలంటే డిజిటల్ మాధ్యమం ఒక్కటే ఆధారం అయింది.డిజిటల్ మార్కెటింగ్‌కు అర్హతలు లేకపోయినా ఫర్వాలేదు… ఎన్నో సంస్థలు సర్టిఫికేషన్‌ను అందిస్తున్నాయి. వాటితో కూడా డిజిటల్ మార్కెటర్‌గా స్థిరపడవచ్చు.

Also Read:అన్ స్టాపబుల్ నాన్ స్టాప్ ఫన్: విజె

()బిల్డింగ్ ఆటోమేషన్

ప్రతి రంగంలోనూ మనుషులు, మెషీన్ల స్థానాన్ని ఆటోమేషన్ రంగం ఆక్రమించడం మొదలైపోయింది. ఇది రానున్న కాలంలో మరింత ఎక్కువ కానుంది. షాపింగ్ మాల్స్, కాలనీలు, అపార్ట్‌మెంట్ల సంస్కృతి పెరిగిపోయిన నేటి కాలంలో ఆటోమేషన్‌కూ ప్రాధాన్యం పెరుగుతోంది.భవనాల్లో లిఫ్టులు, ఎస్కలేటర్లు, సెక్యూరిటీ కెమెరాలు, వైఫై సౌకర్యం, వాటర్ పైపు లైన్లు… ఇలా ఒకటేంటి, అన్నీ ఆటోమేటెడే. దీనికి తగ్గట్లుగానే ఈ రంగంలో నిపుణులకు డిమాండ్ పెరగబోతోంది.

()సైబర్ సెక్యూరిటీ

ఈ ఐటీ యుగంలో డేటాకు ఎంత ప్రాముఖ్యం ఉందో, డేటా భద్రతకూ అంతే ప్రాముఖ్యం ఉంది. హ్యాకింగ్, సైబర్ దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో దీన్ని ఎదుర్కోగల నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. రానున్న కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో ఎన్నో అవకాశాలు రాబోతున్నాయి.

- Advertisement -