కేంద్ర బడ్జెట్ 2018-19…హైలైట్స్‌…

173
Union Budget 2018 highlights
- Advertisement -

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ 2018-19 ఏడాదికిగాను కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఐదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన జైట్లీ…ఎన్నికలకు ముందు పూర్తిస్ధాయి ఆఖరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 20 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టగా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు ఈ బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. దీంతో పాటు వ్యవసాయ రంగం,గ్రామీణ ఆర్ధిక వ్యవస్థపై దృష్టిసారించిన మోడీ బడ్జెట్ పల్లెబాట పట్టింది.

వ్యవసాయం…

()వ్యవసాయరంగాన్ని బలోపేతం చేస్తాం
() 11 లక్షల కోట్లతో వ్యవసాయ రుణాలు
() దేశవ్యాప్తంగా 22 వేల గ్రామీణ అగ్రి కల్చరల్‌ మార్కెట్లు
()2వేల కోట్ల మూలధనంతో ఈ అగ్రిమార్కెట్లు
()ఆయా క్లస్టర్లలో జరిగే గ్రామీణ ఉపాధి హామీ, ఇతర కేంద్ర ప్రభుత్వ పథకాలను సమన్వయం చేస్తూ, ఆన్‌లైన్‌ ద్వారా అగ్రిమార్కెట్లకు అనుసంధానం చేస్తాం
()కౌలు రైతులకు రుణాలజారీ
()ఫుడ్ ప్రాసెసింగ్ కోసం రూ. 1440 కోట్లు
()పశుసంవర్ధక శాఖకు రూ. 10 వేల కోట్లు
()ఆలు,టమాట,ఉల్లిగడ్డ కోసం రూ. 500 కోట్లు
() గ్రామీణ వ్యవసాయ మార్కెట్లకు రూ. 2 వేల కోట్లు
()చేపల పెంపకం, పశుసంవర్థకానికి రూ.10వేల కోట్లు
()జాలర్లకు క్రెడిట్‌ కార్డులు
()అన్ని పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధర.

రైల్వేలు

()రైల్వేకు రూ.1,48,000కోట్లు కేటాయింపు
()వడోదరాలో రైల్వే యూనివర్సిటీ ఏర్పాటు
()18 వేల కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌ డబ్లింగ్‌ పనులకు నిధులు కేటాయింపు
()దేశ వ్యాప్తంగా 600 రైల్వే స్టేషన్లు గుర్తించి వాటి అభివృద్ధి
()4వేల కిలో మీటర్ల మేర కొత్తగా రైల్వే మార్గం
()25 వేలమంది ప్రయాణీకులు వచ్చే రైల్వే స్టేషన్లలో ఎస్కలేటర్ల ఏర్పాటు
()అన్ని రైల్లే స్టేషన్లలో వైఫై, సీసీటీవీల ఏర్పాటు
() కొత్తగా రైల్వేలకు 12,000 వ్యాగన్లు, 5160కోచ్‌లు, 700 లోకోమోటివ్స్‌.
()ముంబై లోకల్ రైళ్ల కోసం రూ. 11 వేల కోట్లు
()బెంగళూరు మెట్రో రైలుకు రూ. 17 వేల కోట్లు
()సబర్బన్ రైల్వే పనులకు రూ . 40 వేల కోట్లు

విద్య

()విద్యా,పరిశోధనకు రూ.1.02 లక్షల కోట్లు
()కొత్తగా 24 మెడికల్‌ కాలేజీలకు అనుమతి
()కొత్తగా 18 ఆర్కిటెక్చర్‌ కాలేజీలు
()స్కూల్‌ టీచర్ల శిక్షణకు ప్రత్యేక స్కూళ్లు
()డిజిటల్‌ విద్యావిధానానికి మరింత చేయూత
() పీఆర్‌ఎఫ్‌(ప్రధానమంత్రి రిసెర్చ్‌ ఫెలోషిప్‌). టాప్‌ వెయ్యి మంది బీటెక్‌ విద్యార్థులు
()గ్రామీణ ప్రాంత పేద విద్యార్ధుల కోసం రూ. 16 వేల కోట్లు
()గిరిజన ప్రాంతాల్లో ఏకలవ్య స్కూళ్లు

హెల్త్‌ 

()టీబీ పేషెంట్ల సరంక్షణకు రూ.670 కోట్లతో ప్రత్యేక నిధి
()మూడు పార్లమెంటరీ స్థానాలకు కలిపి కనీసం ఒక ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు
()టీబీ రోగులకు వైద్యం సమయంలో నెలకు రూ.500
()ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల వరకు హెల్త్‌ స్కీం (ఆయుష్మాన్‌ భవ పథకం). రూ.330 చెల్లిస్తే కుటుంబానికి బీమా
()రూ.లక్షా 38 వేల కోట్లతో ఆరోగ్యరంగానికి నిధులు కేటాయింపు

బడ్జెట్‌లో మరిన్ని హైలైట్స్..

()ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి రూ.లక్షా 5వేల కోట్లు
()ముద్ర యోజనఫండ్‌కోసం రూ.3లక్షల కోట్లు
() ఉచిత విద్యుత్‌ కోసం రూ.16 వేల కోట్లు
()కొత్తగా 2కోట్ల మరుగు దొడ్లు నిర్మించి ఇస్తాం
() ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద 50 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యం
()ఉజ్వల పథకం కింద 8 కోట్ల ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు
()ప్రధానమంత్రి సౌభాగ్య యోజనకు రూ.1600 కోట్లు
()ఆపరేషన్‌ గ్రీన్‌కు రూ.500 కోట్లు
()సౌర విద్యుత్‌ను మరింత ప్రోత్సహిస్తాం
()నేషనల్‌ బ్యాంబూ మెషిన్‌కు రూ.1200 కోట్లు
()అమృత్‌ పథకం కింద రూ.19,428 కోట్లతో 494 ప్రాజెక్టులు
()రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ల వేతనాలు పెంపు. రాష్ట్రపతి గౌరవ వేతనం రూ.5లక్షలు. ఉపరాష్ట్రపతి గౌరవ వేతనం రూ.4లక్షలు, గవర్నర్ల గౌరవ వేతనం రూ.3.5లక్షలు
()14 ప్రభుత్వ రంగ సంస్థలను స్టాక్‌మార్కెట్‌లో లిస్ట్‌ చేస్తాం.
()భారత్‌ నెట్‌వర్క్‌ కార్యక్రమం కోసం రూ.10వేల కోట్లు.
() గ్రామాల్లో 5లక్షల వైఫై రూటర్ల సదుపాయం.
()900 కొత్త విమానాల కొనుగోలు
()టోల్‌ ప్లాజాలో సులభతర ప్రయాణానికి వీలుగా ఎలక్ట్రానిక్‌ చెల్లింపులు.
()2020 నాటికి 50లక్షల మంది యువతకు ఉద్యోగ నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ.
() 56 విమానాశ్రయాలు ఉడాన్‌ పథకం కింద అభివృద్ధి.
()ఇంటింటి తాగునీటి పథకానికి రూ.77,500కోట్లు.
()రోడ్లు, మౌలిక వసతులకు రూ.9.64లక్షల కోట్లు.
() 99 స్మార్ట్ సిటీల అభివృద్ధికి రూ.2.04లక్షల కోట్లు.
()నమామి గంగ పథకం కింద 187 ప్రాజెక్టులు
()10 పర్యాటక కేంద్రాల అభివృద్ధి
()వస్త్రపరిశ్రమ కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలు
() టెక్స్‌టైల్‌ రంగానికి రూ.7,140కోట్లు.
()జన్‌ధన్‌ యోజనలో భాగంగా 60వేల కోట్ల బ్యాంకు ఖాతాలకు బీమా సౌకర్యం వర్తింపు.
()చిన్న, సూక్ష్మతరహా పరిశ్రమల కోసం రూ.3,790కోట్లు.
()ఉజ్వల యోజనలో భాగంగా 8కోట్లమంది గ్రామీణ మహిళలకు గ్యాస్‌ కనెక్షన్లు.
()ఢిల్లీలో కాలుష్య నివారణకు ప్రత్యేక చర్యలు
()42 మెగాఫుడ్‌ పార్కులను పటిష్టం చేస్తాం. ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లకు రూ.1400కోట్లు
()పర్‌ఫ్యూమ్స్‌, ఆయిల్స్‌ కోసం రూ.200కోట్లు.

- Advertisement -