పోస్ట్ ప్రొడక్షన్ లో “ఒక్కటే లైఫ్ “

181
okkate life movie post production works
- Advertisement -

సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి.చౌదరి తనయుడు జితన్ రమేష్ హీరోగా లార్డ్ వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై నారాయణ్ రామ్ నిర్మిస్తొన్న చిత్రం “ఒక్కటే లైఫ్”.. హ్యాండిల్ విత్ కేర్. అనేది ఉప శీర్షిక. ఎం.వెంకట్ దర్శకుడు. శృతి యుగల్ హీరొయిన్ గా నటిస్తొన్న ఈ చిత్రంలొ సుమన్ ప్రధాన పాత్రలో కన్పించనున్నారు. త్వరలొ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్బంగా దర్శకుడు వెంకట్ మాట్లాడుతూ.. ‘టైటిల్ చూడగానె సినిమా కాన్సెప్ట్ ఏంటనేది అందరికీ అర్దమవుతుంది. టెక్నాలజీ పేరుతో పరుగులెడుతొన్న నేటి తరం హ్యూమన్ రిలెషన్స్ కు ఎమోషన్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలన్న కాన్సెప్ట్ తో తెరకెక్కుతొన్న చిత్రమిది. సినిమాలోని ప్రతి పాత్రకు ఓ పర్పస్ ఉంటుంది. సూపర్ గుడ్ అధినేత ఆర్.బి.చౌదరి గారబ్బాయి జితన్ రమేష్ హీరోగా నటిస్తున్నారు. మంచి సినిమా చూశామన్న సంతృప్తి ప్రేక్షకుల కు మా సినిమా కలిగిస్తుంది’అన్నారు.

ఇక నిర్మాత నారయణ్ రామ్ మాట్లాడుతూ.. ‘చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మా టీమ్ అందరికీ మంచి పేరును తీసుకువచ్చె చిత్రంగా నిలుస్తుంది. అతి త్వరలోనె సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు.

- Advertisement -