తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తలపెట్టిన యువగళం పాదయాత్రలో ప్రముఖ నటుడు తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో ఆయనను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స నిర్వహించారు. ఈ నేపథ్యంలో తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై సినీ నటుడు, బాబాయి నందమూరి బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు.
తారకరత్నకు తీవ్ర గుండెపోటు గురైనట్టు తెలిపారు. గుండెలోని ఎడమ భాగంలోదాదాపుగా 90శాతం బ్లాక్ అయినట్టు డాక్టర్స్ దృవీకరించినట్టు తెలిపారు. కానీ మిగితా రిపోర్టులు బాగున్నాయి. ప్రస్తుతం తారకరత్న బీపీని అదుపులో ఉంచుతూ చికిత్సనందిస్తున్నారు. డాక్టర్ల సలహా మేరకు మెరుగైన వైద్యం నిమిత్తం బెంగళూరుకు షిఫ్ట్ చేస్తామని తెలిపారు. టీడీపీ అధినేత ఘటనపై ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారని అన్నారు.
దీంతో పాటు జూ.ఎన్టీఆర్ కూడా ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారని అన్నారు. తారకరత్న భార్యకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని వివరించినట్టు తెలిపారు. దీంతో పాటుగా నందమూరి కుటుంబసభ్యులకు కూడా ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి వివరించామని తెలిపారు. అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఇవి కూడా చదవండి…