నాని క్లారిటీ ఇచ్చేశాడుగా

70
- Advertisement -

నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా మూవీ ‘దసరా’ పై ఓ ప్రచారం జరుగుతుంది. నాని ఊర మాస్ కేరెక్టర్ లో నటిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుందనే ప్రచారం ఉంది. దీంతో నాని ఫ్యాన్స్ తమ హీరో రెండు భాగాల మాస్ కంటెంట్ తో వస్తున్నాడని సంతోష పడ్డారు. అభిమానుల సంతోషం మీద నాని నీళ్ళు చల్లుతూ క్లారిటీ ఇచ్చాడు. దసరాకి కొనసాగింపు లేదని తేల్చి చెప్పేశాడు నాని. పార్ట్ 2 ఉండనుందని ప్రచారంపై కూల్ గా జస్ట్ వన్ అంటూ ట్వీట్ చేశాడు నాని. దసరా రెండు భాగాలు కాదు కానీ డబుల్ పవర్ కంటెంట్ ఉండనుంది అన్నట్టుగా చెప్పుకున్నాడు.

నాని క్లారిటీతో దసరాపై జోరుగా జరుగుతున్న ప్రచారానికి ఫులిస్టాప్ పడింది. రా రస్టిక్ కంటెంట్ తో మాస్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. శ్రీ లక్ష్మి వేంకటేశ్వర సినిమాస్ బేనర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. నేను లోకల్ తర్వాత నాని -కీర్తి సురేష్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. దసరా ఐదు భాషల్లో మార్చ్ 30 న రిలీజ్ కానుంది.

ఇవి కూడా చదవండి…

నా భార్యకు రుణపడి ఉంటా..తలైవా

ఈ లీకులేంటి పుష్ప ?

జమున లైఫ్ లోని ఇంట్రెస్టింగ్ విషయాలు

- Advertisement -