వెంకీ దర్శకుడి ప్రామిస్

84
- Advertisement -

రెండు హిట్లు కొట్టిన యంగ్ డైరెక్టర్ చేతిలో తన 75 వ సినిమా పెట్టాడు విక్టరీ వెంకటేష్. అయితే అనౌన్స్ మెంట్ ముందు వరకు అసలు శైలేష్ కి వెంకీ ఎందుకు అవకాశం ఇచ్చాడు ? ఏదైనా థ్రిల్లర్ స్టోరీతో మెప్పించాడా ? అనే అనుమానాలు కలిగాయి. కానీ ప్రీ పోస్టర్ తో ఎనౌన్స్ చేసినప్పటి నుండి సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో క్లారిటీ ఇస్తూ వచ్చాడు శైలేష్. ఇప్పటి వరకూ వెంకటేష్ ను చూడని ఓ పవర్ ఫుల్ వెపన్ లా చూపించబోతున్నట్లు సైంధవ్ గ్లిమ్స్ తో పూర్తి క్లారిటీ ఇచ్చాడు.

తాజాగా గ్రాండ్ గా ఓపెనింగ్ జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించి మరోసారి వెంకీ ఫ్యాన్స్ కి ఫుల్ భరోసా ఇచ్చాడు శైలేష్. “ఇది వెంకటేష్ గారికి ఓ ట్రిబ్యూట్ మాత్రమే కాదు, నేను ఫిల్మ్ మేకర్‌గా మారడానికి కారణం ఏమిటంటే, నేను అతని కోసం దీన్ని చేయాలని నిర్ణయించుకున్నాను” అలాగే అభిమానులు గర్వపడేలా నా రక్తాన్ని మరియు చెమటను పెడతానంటూ శైలేష్ సోషల్ మీడియా వేదికగా చెప్పుకున్నాడు. సొ ట్విటర్ ద్వారా విక్టరీ ఫ్యాన్స్ కు శైలేష్ ప్రామిస్ చేశాడు. మరి ఈ సినిమాను ఎలా తీర్చి దిద్దుతాడో చూడాలి.

ఇవి కూడా చదవండి…

వెంకీ..‘సైంధవ్’ ప్రారంభం

సత్యదేవ్ 26… ‘జీబ్రా’

జమున లైఫ్ లోని ఇంట్రెస్టింగ్ విషయాలు

- Advertisement -