తెలంగాణలోని పదోతరగతి విద్యార్థులకు శుభవార్త తెలిపారు. పదో తరగతిలో రాయబోయే ప్రశ్నల సెక్షన్లో స్వల్పంగా ఛాయిస్ పెంచారు. ఆరు ప్రశ్నలో కేవలం నాలుగింటికి మాత్రమే రాసే అవకాశం కల్పిస్తూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. పొయిన యేడాదిలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం వ్యాసరూప ప్రశ్నల సెక్షన్లో ఇంటర్నల్ ఛాయిస్ ఉండేది. అంటే ప్రతి ప్రశ్నలో ఎ లేదా బీ అని రెండు ప్రశ్నలిస్తారు. అందులో ఒక దానికి మాత్రమే జవాబు రాయాలి. అలా కాకుండా ఇప్పుడు మొత్తంగా నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయాలని ఉత్తర్వులు ఇచ్చింది. అయితే గత కొంత కాలంగా కరోనా కారణంగా విద్యార్థుల్లో విద్యానాణ్యతలు తగ్గాయని దానికి తగ్గట్టుగా పరీక్షల విధానంలో మార్పులు తేవాలని ఛాయిస్ పెంచాలని ఉపాధ్యాయ సంఘాల నుంచి ఒత్తడి రావడంతో తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పు తెలుగు ఆంగ్లం హిందీ సబ్జెక్ట్‌లకు ఉండదు. మిగిలిన భాషేతర సబ్జెక్ట్‌లైన గణితం సామాన్య శాస్త్రం సాంఘిక శాస్త్రం మాత్రమే వర్తించేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఇది వచ్చే ఏప్రిల్‌లో జరిగే వార్షిక పరీక్షలతో పాటుగా 2023-24 విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందని ఉత్తర్వులో వెల్లడించారు. ఈ మార్పులన్నీ తొమ్మిదో తరగతికి వర్తంచేలా ఉత్తర్వులో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి…