బాలయ్య ఓ రోజంతా తినలేదు!

47
- Advertisement -

క్యారెక్టర్ కోసం బాలయ్య బాబు ఏ రేంజ్ లో కష్టపడతాడో అందరికీ తెలిసిందే. అందుకే, బాలయ్య యాక్టింగ్ ను ఎవ్వరూ వంకపెట్టలేరు. బాలయ్య డెడికేషన్ ఏ రేంజ్ లో ఉంటుందనడానికి మరో ఎగ్జాంపుల్ ఇది. పాత్ర కోసం బాలయ్య ఒక రోజంతా ఏమీ తినలేదంట. వీరసింహా రెడ్డి సినిమాలో యంగ్ రోల్ చేశాడు బాలయ్య. ఇందులో సీనియర్ బాలయ్యనే మెయిన్ అయినప్పటికీ, సినిమా మొత్తం బాలయ్య యంగ్ పాత్ర చుట్టూ తిరుగుతుంది.

జయసింహ రెడ్డి అనే పాత్ర పోషించిన బాలయ్య, ఈ సినిమాలో ఓ సీన్ కోసం నీరసంగా కనిపించాలి. దాని కోసం బాలయ్య ఒక రోజంతా తినడం మానేశాడట. ఓ క్యారెక్టర్ కోసం బాలయ్య బాబు పడే కష్టం ఆ రేంజ్ లో ఉంటుంది అన్నమాట. ఇంతకీ ఆ సీన్ ఏమిటో తెలుసా ?, తన తండ్రి వీర సింహారెడ్డి అంతిమ యాత్ర సీన్ అది. ఈ సీన్ లో యంగ్ బాలయ్య చాలా ఎమోషనల్ అవ్వాలి.

అదేవిధంగా చాలా వీక్ గా కనిపించాలి. అందుకే.. బాలయ్య ఏం తినకుండా ఎంతో కష్టపడ్డాడు. అయినా ఉపయోగం ఏముంది ?, బాలయ్య హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయింది. బాలయ్య అద్భుతంగా నటించినా మలినేని గోపీచంద్ బాగా నిరుత్సాహ పరిచాడు.

ఇవి కూడా చదవండి…

మెగా ముచ్చట్లు.. కాస్త స్పైసీగా !

అజిత్ పై విజయ్ గెలుపు ?

డే 1 రికార్డ్ ఎవరి సొంతం?

- Advertisement -