రాహుల్ జోడో 100 రోజులు.. లక్ష్యం చేరువైయ్యేనా ?

33
- Advertisement -

2014 ఎన్నికల్లో ఊహించని విధంగా దారుణ ఓటమిని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఆ తరువాత నుంచి మెల్లగా ఉనికిని కోల్పోతు వచ్చింది.. కేంద్రంలోనే కాకుండా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ వంటి ఆయా రాష్ట్రాలలో కూడా పూర్తి పట్టుకోల్పోతూ వచ్చింది. దాంతో ఒకప్పుడు జాతీయ పార్టీగా దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన ఆ పార్టీ.. ప్రస్తుతం ఉనికిని కాపాడుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే పార్టీ ఇంత దారుణంగా విఫలం అవ్వడానికి కారణాలు ఏవైనప్పటికి.. ఆ పార్టీకి మళ్ళీ పునర్జీవం పోసేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రస్తుతం విశ్వ ప్రయత్నలే చేస్తోంది. అందులో భాగంగానే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. .

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ ప్రజలను ఏక మ చేసేందుకే ఈ జోడో యాత్ర అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నప్పటికి.. ఎన్నికల వ్యూహంలో భాగమే ఈ జోడో యాత్ర అనేది జగమెరిగిన సత్యం. కాగా మొదటి నుంచి రాహుల్ గాంధీ పైన ప్రశంశల కన్నావిమర్శలే ఎక్కువగా వినిపించేవి. స్థిరత్వం లేని నాయకూడని, ప్రధాని అభ్యర్థికి అనర్హుడని ఇలా రకరకాల విమర్శలు గట్టిగానే వినిపించేవి. దాంతో ఈ విమర్శలన్నిటికి చెక్ పెట్టేందుకు.. అలాగే ప్రజలతో మమేకం అయ్యేందుకు ‘ భారత్ జోడో యాత్ర ‘ ను చేపట్టారు రాహుల్ గాంధీ. ఒక విధంగా చెప్పాలనే ఈ జోడో యాత్ర రాహుల్ గాంధీలో కొత్త ఉత్సాహాన్ని నింపిందనే చెప్పాలి.

గతంలో ఎన్నడూ లేనంతగా ప్రజలతో మమేకం అవుతూ పార్టీని బలపరుస్తూ వస్తున్నారు రాహుల్ గాంధీ. కాగా ఈ జోడో యాత్ర తనలో చాలానే మార్పు తీసుకొచ్చిందని స్వయంగా రాహుల్ గాంధే పలు మార్లు చెప్పుకొచ్చారు. ఇక ఇప్పటివరకు తమిళ్ నాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మద్యప్రదేశ్ రాష్ట్రాలలో యాత్ర పూర్తి చేసిసిన రాహుల్ ప్రస్తుతం రాజస్తాన్ లో కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ జోడో యాత్ర 100 రోజులు పూర్తి చేసుకుంది. కాగా ఈ వంద రోజులలో రాహుల్ జోడో యాత్రకు అనుకున్న దానికంటే అధికంగానే ప్రజల నుంచి స్పందన వచ్చింది. ఇలాగే వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు ఈ జోడో యాత్ర కొనసాగనుంది. మొత్తానికి రాహుల్ చేపట్టిన జోడో యాత్ర కాంగ్రెస్ నేతల్లో కొత్త జోష్ నింపినట్లే కనిపిస్తోంది. మరి రాబోయే ఎన్నికల్లో ఈ జోడో యాత్ర ప్రభావం కాంగ్రెస్ కు ఎలాంటి ఫలితాన్ని కట్టబెడుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -