మాస్‌ వీరయ్య!

37
- Advertisement -

ఈ సంక్రాంతికి సత్తాచాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకురానుంది. చిరు – రవితేజ మల్టీస్టారర్‌గా ఈ సినిమా వస్తుండగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ ఒక్క చిత్రంలోనే మెగాస్టార్ పలు భిన్నమైన షేడ్స్ లో కనిపిస్తుండగా తాజాగా ఓ సాలిడ్ పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్‌. తన ప్రాంగణంలో అంతా గన్స్ అలాగే చేతికి సంకెళ్లు చూస్తుంటే ఓ క్రేజీ యాక్షన్ సీక్వెన్స్ లా ఇది అనిపిస్తుంది.

మరి దీనితో పాటుగా చిరు మంచి స్టైలిష్ అవతార్ లో కూడా కనిపిస్తున్నారు. దీనితో మేకర్స్ మరింత హైప్ ని సినిమాపై తీసుకొచ్చారని చెప్పొచ్చు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -