టోక్యో ఒలింపిక్స్‌.. గోల్ఫ్‌లో భార‌తకు 4వ స్థానం..

200
- Advertisement -

టోక్యో ఒలింపిక్స్‌లో భార‌త గోల్ఫ‌ర్ అదితి అశోక్‌కు తృటిలో ప‌త‌కం కోల్పోయింది. గోల్ఫ్ వ్యక్తిగత స్ట్రోక్ ప్లేలో ఓడిన‌ప్ప‌టికీ ఆమె 4వ స్థానంలో నిలిచింది. 72 హోల్స్ నిర్వ‌హించే స‌మ‌యానికి ఆమె నాలుగో స్థానంలో నిలిచిన‌ట్లు క్రీడా నిర్వాహ‌కులు ప్ర‌క‌టించారు. ఇక తొలి స్థానంలో నిలిచిన‌ అమెరికా గోల్ఫర్ నెల్లీ కొర్డా స్వర్ణ ప‌త‌కం అందుకుంది. రెండో స్థానంలో జ‌పాన్, న్యూజిలాండ్‌కు చెందిన మ‌హిళా గోల్ఫ‌ర్‌లు సంయుక్తంగా నిలిచారు.

కాగా, ఒలింపిక్స్ లో 4వ స్థానంలో నిలిచిన మొట్ట‌మొద‌టి భార‌త గోల్ఫ‌ర్‌గా అదితి నిలిచింది. ఓడిపోయిన‌ప్ప‌టికీ అద్భుత ప్రదర్శనతో భార‌త్ నుంచి ప్ర‌శంస‌లు అందుకుంటోంది అదితి. ఒలింపిక్స్ లో అదితి ప్రదర్శనతో భారత్ లో గోల్ఫ్ కు ఆదరణ పెరుగుతుందని భావిస్తున్నారు.

- Advertisement -