ఇంట్రెస్టింగ్‌గా ఆది ‘బ్లాక్’ టీజర్..

52

యంగ్‌ హీరో ఆది సాయికుమార్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ‘అమరన్’ .. ‘కిరాతక’ .. ‘బ్లాక్’ సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఒకదానితో ఒకటి ఎంతమాత్రం సంబంధం లేని కథలను ఆయన చేస్తూ వెళుతున్నాడు. ప్రస్తుతం ‘బ్లాక్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. మహంకాళి మూవీస్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాకు, జీబీ కృష్ణ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాతో కథానాయికగా ‘దర్శన’ పరిచయమవుతోంది. సురేశ్ బొబ్బిలి సంగీతాన్ని అందించిన ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయనున్నారు.

ఈనేపథ్యంలో ఈ మూవీ నుంచి తాజాగా టీజర్‌ను విడుదల చేశారు చిత్ర బృందం. యాక్షన్ సీన్స్ పై కట్ చేసిన టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. విలన్ ఆటకట్టించడానికి హీరో చేసే ప్రయత్నం .. హీరో అంతుచూసే వ్యూహాలతో విలన్ మధ్య జరిగే వార్ తో ఈ కథ నడవనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆది సాయికుమార్ డేరింగ్ పోలీస్ ఆఫీసర్‌గా, గతంలో కంటే మరింత ఫిట్ నెస్ తో కనిపిస్తున్నాడు.

BLACK Official Teaser | Aadi Sai Kumar | GB Krishna | Mahankali Movies