మహిళల హాకీ..భారత్ చేజారిన కాంస్యం

61
womens hockey

టోక్యో ఒలింపిక్స్‌ మ‌హిళ‌ల హాకీ పోరులో భారత యాత్ర ముగిసింది. కాంస్యం కోసం సాగిన పోరులో భారత్‌ను 4-3 తేడాతో ఓడించి పతకాన్ని సొంతం చేసుకుంది బ్రెజిల్. హోరాహోరిగా మ్యాచ్ సాగిన ఫోర్త్ క్వార్ట‌ర్స్‌లో చేతులెత్తేశారు భారత మహిళా ఆటగాళ్లు. అయినా స్పూర్తిదాయ‌క‌మైన ఆట‌ తీరును కనబర్చి అందరి మనసు గెలుచుకున్నారు.

తొలి క్వార్ట‌ర్‌లో రెండు జ‌ట్లు గోల్ చేయ‌లేక‌పోయాయి. సెకండ్ క్వార్ట‌ర్‌లో గోల్స్ వ‌ర్షం కురిసింది. బ్రిట‌న్ రెండు గోల్స్ చేయ‌గా.. ఇండియ‌న్ వుమెన్ మూడు గోల్స్ చేశారు. ఇక మూడవ క్వార్టర్ ముగిసే సరికి రెండు జ‌ట్లు 3-3 గోల్స్‌తో స‌మంగా నిలిచాయి. టెన్ష‌న్‌గా మారిన నాలుగ‌వ క్వార్ట‌ర్‌లో.. 48వ నిమిషంలో గ్రేస్ బ‌ల్స‌డ‌న్ గోల్ చేయ‌డంతో బ్రిట‌న్‌కు ఆధిక్యం దక్కింది.