టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం..

156

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో పతకం చేరింది. భారత రెజ్లర్ భజరంగ్ పునియా కాంస్యం సాధించాడు. ఈ మధ్యాహ్నం కాంస్యం కోసం జరిగిన పోరులో భజరంగ్ 8-0తో కజకిస్థాన్ కు చెందిన దౌలత్ నియాజ్ బెకోవ్ ను మట్టికరిపించాడు. పురుషుల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ 65 కేజీల విభాగంలో జరిగిన ఈ పోరులో భజరంగ్ పునియా తన స్థాయికి తగిన ప్రదర్శన కనబరిచాడు. సెమీఫైనల్లో ఓటమి అనంతరం కుంగిపోకుండా, ఈ మ్యాచ్ లో తన నైపుణ్యాన్ని ప్రదర్శించి భారత్ ఖాతాలో ఆరో పతకాన్ని చేర్చాడు. భారత్ కు టోక్యో ఒలింపిక్స్ లో ఇప్పటిదాకా 2 రజతాలు, 4 కాంస్యాలు లభించాయి.. అంతకుముందు లండన్ ఒలింపిక్స్ లోనూ భారత్ కు 6 పతకాలు లభించగా, ఇప్పుడా పతకాల సంఖ్యను భారత్ సమం చేసింది.