చేనేత కార్మికులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు..

93
CM KCR

చేనేత కార్మికులకు సీఎం కేసీఆర్ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చేనేత రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కేసీఆర్ అన్నారు. నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతోందని, బతుకమ్మ చీరలు తదితర కార్యక్రమాలతో నేతన్నలకు చేతినిండా పని కల్పిస్తున్నామని పేర్కొన్నారు. చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులను గుర్తించి సత్కరించుకుంటున్నామని కేసీఆర్ గుర్తు చేశారు.

‘కొండా లక్ష్మణ్ బాపూజీ’ పేరుతో అవార్డులు అందిస్తున్నామని సీఎం అన్నారు. ఎగ్జిబిషన్లు , ఫ్యాషన్ షోలను నిర్వహిస్తూ చేనేతలకు ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. రైతు బీమా మాదిరి చేనేత కార్మికులకు బీమా సౌకర్యాన్ని అమలులోకి తేనున్నామన్నారు. చేనేత కార్మికులకు ఫించన్లు ఇస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనన్నారు. చేనేత కార్మికులకు అమలు చేస్తున్న వినూత్న పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని సీఎం తెలిపారు.