స్ధానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి: ఎంపీ వెంకటేష్

519
venkatesh nethakani
- Advertisement -

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం రైల్వే గేటు వద్ద స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలంటూ రోడ్డు పై బైఠాయించి నిరసన వ్యక్తం చేశాన ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత , ఎమ్మెల్యే కోరుకంటి చందర్..స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఇతర రాష్ట్రాల నుండి ఉద్యోగ నియామకాలు చేపట్టి స్థానికులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.

కేంద్ర మంత్రి సదానంద గౌడ పర్యటన లో స్థానిక ఎమ్మెల్యే కు , ఎంపీ నైనా తనకు అధికారులు సమాచారం ఇవ్వలేదన్నారు. కేంద్ర మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. దీంతో ఎంపీ , ఎమ్మెల్యే ల వద్ద కు వచ్చి పరిస్థితి ని అడిగి తెలుసుకుని వినతి పత్రాన్ని స్వీకరించారు కేంద్ర మంత్రి సదానంద గౌడ. రాస్తా రోకో లో బీజేపీ కార్యకర్తల అత్యుత్సాహం తో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరుగగా పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితి ని చక్కదిద్ది కేంద్ర మంత్రి కాన్వాయ్ ని ఎరువుల కర్మాగారం సందర్శన కు పంపించారు.

- Advertisement -