తెలంగాణాంతటా మోదీపై నిరసన సెగ..

183
- Advertisement -

తెలంగాణకు ప్రధాని మోదీ రాకను వ్యతిరేకిస్తూ కేబీఆర్ పార్క్ దగ్గర తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో నల్ల బెలూన్లను ఎగరవేసి నిరసన కార్యక్రమం చేపట్టింది. గో బ్యాక్ మోదీ.. నో ఎంట్రీ టూ తెలంగాణ ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మోదీ రాకను నిరసన వ్యక్తం చేశారు.

చేనేతపై విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ చేనేత యూత్‌ఫోర్స్‌ డిమాండ్‌ చేసింది. జీఎస్టీని వెనక్కి తీసుకున్న తర్వాతే రాష్ట్రంలో అడుగుపెట్టారన్నారు. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర సర్కార్‌ కార్పొరేట్లకు కొమ్ముకాసే ప్రభుత్వమని విమర్శించారు.

ప్రధాని మోదీ తెలంగాణ వ్యతిరేకి.. తెలంగాణకు వచ్చే ప్రాజెక్టులు, పరిశ్రమలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు అలిశెట్టి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రముఖ ప్రాజెక్టులను అదాని, అంబానీలకు కట్టబెట్టడం కేంద్ర పరిపాటిగా మారిందని విమర్శించారు.

ఇవి కూడా చదవండి..

అయితే జుమ్లా…లేకపోతే హమ్లా

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని అరెస్ట్..

మీడియా కాదు మోడీయా: కేటీఆర్

- Advertisement -