ప్రకాశ్ రాజ్‌కు నాగబాబు కౌంటర్…

140
naga babu

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీకి జనసేనాని పవన్ కల్యాణ్ మద్దతు ప్రకటించడంపై ప్రకాశ్‌ రాజ్‌ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. నేత అంటే ప్రజలకు ఉపయోగపడాలని, పార్టీల మధ్య కప్పగెంతులు వేయకూడదని చురకలు అంటించగా ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానం ఇచ్చారు మెగాబ్రదర్ నాగబాబు.

పవన్ ఎవరికి ద్రోహం చేశాడని, ప్రతీ పనికిమాలిన వాడు విమర్శిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకు మద్దతు ఇవ్వడం ద్వారా ప్రజలకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు. ఏ రాజకీయ పార్టీ అయినా తీసుకున్న నిర్ణయాలు నీకు నచ్చకపోతే విమర్శించు తప్పులేదు….అలాగే వారు ప్రజలకు ఉపయోగే పని చేసినప్పుడు హర్షించ గలగాలన్నారు.

విమర్శించడం తప్ప మంచిని గుర్తించలేని నీకు సంస్కారం ఎలా నేర్పించగలుగుతాం…కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. దేశానికి బీజేపీ, ఆంధ్రాకి జనసేన వంటి పార్టీలు ఉంటేనే అవి అభివృద్దిని చూపగలుగుతాయని చెప్పారు.