ఏపీలో తగ్గిన కరోనా ఉధృతి..

29
ap corona

ఏపీలో కరోనా ఉధృతి తగ్గింది. గత 24 గంటల్లో 83,461 కరోనా పరీక్షలు నిర్వహించగా కేవలం 7,943 కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి (1,877), చిత్తూరు (1,283) జిల్లాలను మినహాయిస్తే, మిగతా అన్ని జిల్లాల్లో వెయ్యికి లోపే కొత్త కేసులు వచ్చాయి. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 231 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 19,845 మంది కరోనా నుంచి కోలుకోగా, 98 మంది మరణించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 15 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 12 మంది, ప్రకాశం జిల్లాలో 10 మంది మృతి చెందారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 10,930కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 16,93,085 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా సోకినవారిలో 15,28,360 మంది కోలుకోగా, ఇంకా 1,53,795 మంది చికిత్స పొందుతున్నారు.