దేశంలో 24 గంటల్లో 47,092 కరోనా కేసులు..

132
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 47,092 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 509 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,28,57,937కు చేరుకున్నాయి. కరోనాతో ఇప్పటివరకు 4,39,529 మంది మృతిచెందగా రికవరీ కేసులు 3,20,28,825కి చేరాయి. ప్రస్తుతం దేశంలో 3,89,583 యాక్టివ్‌ కేసులుండగా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 66,30,37,334 వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్టు వైద్య,ఆరోగ్య శాఖ వెల్లడించింది.