- Advertisement -
కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్‌ని యూఏఈలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ముంబై ఐదోసారి టైటిల్‌ని గెలుచుకోగా బీసీసీఐ ఆర్జించిన లాభాలు చూసి అంతా షాకవుతున్నారు.
యూఏఈలో ఐపీఎల్ 2020 నిర్వహిణ కోసం రూ. 100 కోట్లు చెల్లించి. బీసీసీఐ వేల కోట్లలో లాభాలను ఆర్జించింది. రికార్డు స్థాయిలో వ్యూయర్‌షిప్ వచ్చిన ఈ సీజన్ ద్వారా రూ. 4000 కోట్లు ఆర్జించింది. అంతే కాదు గత సీజన్‌తో పోలిస్తే ఖర్చు 35 శాతం తగ్గిందని బీసీసీఐ అధికారులు వెల్లడించారు.
టీవీ వ్యూయర్‌షిప్ 25 శాతం పెరిగిందని బీసీసీఐ అధికారులు వెల్లడించారు. బీసీసీఐ 30 వేల కోవిడ్ టెస్టులు చేసిందని.. ఐపీఎల్‌ను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించడం కోసం 1500 మంది పని చేశారని వెల్లడించారు.
- Advertisement -