డీ సీక్వెల్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్!

226
manchu vishnu
- Advertisement -

మంచు విష్ణు హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్ ఢీ. 13 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా విష్ణు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. విష్ణు- బ్రహ్మానందం కామెడీ సినిమాకే హైలైట్‌గా నిలవగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది.

తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కనుందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. విష్ణు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఢీ సీక్వెల్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చింది.

ప్రేక్ష‌కులకి పసందైన వినోదం అందించండం కోసం డీ అంటే డీగా రానున్నామని తెలిపించి చిత్రయూనిట్. మ‌హ‌తి సాగ‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా, ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు.

- Advertisement -