పృథ్విరాజ్‌కు ఈడీ నోటీసులు..

16
- Advertisement -

మలయాళం చిత్రం L2-ఎంపురాన్‌ మూవీ నిర్మాతలపై ఈడీ దాడులు జరుగుతున్నాయి. నిర్మాత గోకులం గోపాలన్‌ ఇంట్లో తనిఖీలు చేశారు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ అధికారులు. రూ.కోటిన్నర రూపాయలను స్వాధీనం చేసుకోగా అలాగే ఎంపురాన్‌ సినిమా డైరెక్టర్‌, నటుడు అయిన పృథ్వీరాజ్‌కు కూడా నోటీసులు జారీ చేసింది.

ఎల్‌2: ఎంపురాన్‌ చిత్రాన్ని తెరకెక్కించడం వల్లే గోపాలన్‌పై అక్రమ కేసులు పెట్టి కేంద్రం వేధిస్తోందని కేరళలో అధికారంలో ఉన్న ఎల్‌డీఎఫ్‌తో పాటు యూడీఎఫ్‌ ఆరోపిస్తున్నాయి.

ఎల్‌2: ఎంపురాన్‌ చిత్రంలో గుజరాత్‌ అల్లర్లకు సంబంధించిన సన్నివేశాలు ఉండటంపై వివాదాలు చెలరేగాయి. దీనిపై చిత్రబృందం ఇప్పటికే క్షమాపణలు చెప్పింది.

Also Read:ఎన్టీఆర్‌పై హృతిక్ ప్రశంసలు!

- Advertisement -