టాస్‌ గెలిచిన ఢిల్లీ..

130

ఐపీఎల్ 2020 టోర్నీలో ఇవాళ కీలక మ్యాచ్ జరుగుతోంది. దుబాయ్ వేదికగా తొలి క్వాలిఫైయర్‌లో ముంబై ఇండియన్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. బుమ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌, హార్డిక్‌ పాండ్య మళ్లీ తుది జట్టులోకి వచ్చినట్లు ముంబై సారథి రోహిత్‌ శర్మ తెలిపాడు. క్వాలిఫయర్‌-1లో ఓడిన జట్టుకు ఫైనల్‌ చేరేందుకు మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్‌ విజేతతో జరిగే క్వాలిఫయర్‌-2లో గెలిస్తే తుదిపోరుకు చేరొచ్చు.ఐదోసారి టైటిల్‌ దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌.. తొలి టైటిల్‌పై కన్నేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆసక్తికర పోరులో తలపడనున్నాయి.

జట్ల వివరాలు:

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, ఆజింక్య రహానే, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), మార్కుస్ స్టోయినిస్, డేనియల్ సామ్స్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కాగిసో రబడ, అన్రిచ్ నార్జీ.

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, నాథన్ కల్టర్‌నైల్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జాస్ప్రిత్ బుమ్రా.