ఈనెల మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ తెలిపింది. భక్తుల సౌకర్యార్థం రాష్ట్రంలో 2427ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు తెలిపింది. రాష్ట్రంలోని 40 శైవక్షేత్రాలకు ఈ నెల 17నుంచి 19వ తేదీ వరకు ఈ ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలంకు 578బస్సులు, వేములవాడకు 481, కీసరగుట్టకు 239, ఏడుపాయలకు 497, వేలాలకు 108, కాళేశ్వరానికి 51, కొమురవెళ్లికి 52, కొండగట్టుకు 37, అలంపూర్‌కు 16, రామప్పకు 15, ఉమా మహేశ్వరానికి 14 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, ఎండీ సజ్జనార్ తెలిపారు. రద్దీకి అనుగుణంగా అవసరమైతే మరిన్ని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. అద్దె బస్సులపై 10శాతం రాయితీని టీఎస్ఆర్టీసీ కల్పిస్తోందని భక్తులు ఈ సౌకర్యాన్ని కల్పించుకోవాలని సూచించారు.
ఇవి కూడా చదవండి…