బీజేపీ కపట ప్రేమ.. తమిళులు నమ్ముతారా?

11
- Advertisement -

తమిళులకు ప్రాంతీయ అభిమానం ఎక్కువ అనే విషయం అందరికీ తెలిసిందే. అక్కడ సినిమా హీరోల విషయంలోనైనా లేదా రాజకీయ నాయకుల విషయంలోనైనా సొంత రాష్ట్రం వారికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు అక్కడి ప్రజలు, అందువల్ల తమిళనాడులో ప్రాంతీయ అభిమానం దాటుకొని గుర్తింపు పొందడం అనేది కాస్త కష్టమనే చెప్పవచ్చు. ముఖ్యంగా రాజకీయాల్లో డి‌ఎం‌కే, అన్నా డి‌ఎం‌కే వంటి ప్రాంతీయ పార్టీలకే అధికారాన్ని కట్టబెడుతున్నారు అక్కడి ప్రజలు. తమిళనాడులో పాగా వేయాలని బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నప్పటికి ఫలితం మాత్రం శూన్యంగానే ఉంది.

అయితే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే కాషాయ పార్టీ తమిళనాడులో పాగా వేసేందుకు గట్టి ప్రణాళికాలే వేసినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే జాతీయ స్థాయి పదవుల్లో తమిళులకే అధిక ప్రదాన్యం ఇవ్వడమే ఇందుకు నిదర్శనం. ఇప్పటికే తమిళనాడు నుంచి ఇద్దరికీ గవర్నర్ బాద్యతలు అప్పగించడంతో పాటు మరొకరికి కేంద్రమంత్రి పదవి కూడా కట్టబెట్టింది మోడి సర్కార్. ఇక తాజాగా మరో తమిళ్ సీనియర్ నేత సీపీ రాధాకృష్ణన్ ను జార్ఖండ్ గవర్నర్ గా నియమించింది కేంద్రం.

ఇప్పటివరకు బీజేపీకి చెందిన తమిళులు.. తెలంగాణ గవర్నర్ గా తమిళి సై సౌందర్యరాజన్ ( పుదుచెర్రి లెఫ్టినెంట్ గవర్నర్ ), మణిపుర్ గవర్నర్ గా ఇలగణేశన్ ( ప్రస్తుతం నాగాల్యాండ్ కు బదలి అయ్యారు ) , అదే రాష్ట్రనికి చెందిన ఎల్ మురుగన్ ఏకంగా రాజ్యసభ హోదాలో కేంద్ర సహాయకమంత్రి హోదాలో ఉన్నారు. ఇక కీలక బాద్యతలు అన్నీ తమిళులకే కట్టబెడుతూ తమిళనాడులో పరిధి పెంచుకునే పనిలో ఉంది కాషాయ పార్టీ. అయితే కాషాయ పార్టీ తీసుకునే ఎలాంటి నిర్ణయాలైనా కేవలం రాజకీయ లభ్డికోసమే అనే వాదన మొదటి నుంచి ఉంది. ఈ నేపథ్యంలో తమిళ ప్రజలకూ చేరువైయ్యేందుకే కమలం పార్టీ తమిళనాడుపై కపట ప్రేమ కనబరుస్తోందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి బీజేపీ తమిళనాడుపై గట్టిగానే ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. మరి తమిళ్ ప్రజలు బీజేపీని ఎంతవరకు నమ్ముతారో చూడాలి.

ఇవి కూడా చదవండి…

ఘర్ వాపసే..సొంత గూటికి ఈటల?

మోడీ పాలనలో.. దేశం నాశనం !

నేటి బంగారం,వెండి ధరలివే..

- Advertisement -