రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం..

33
coronavirus

తెలంగాణలో కరోనా మహమ్మారి క్రమంగా తగ‌్గుముఖం పడుతోంది. రాష్ట్రంలో కొత్తగా 351 కరోనా కేసులు నమోదవగా, ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,89,784కు చేరగా, 1565 మంది మరణించారు. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 2,83,463 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారు. మరో 4756 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, నిన్న కొత్తగా 415 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 2584 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. దీంతో కరోనా రికవరీ రేటు 97.81 శాతం, మరణాల రేటు 0.54 శాతంగా ఉన్నదని ప్రభుత్వం వెల్లడించింది.

రాష్ట్రంలో నిన్న ఒకేరోజు 37451 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటివరకు 72,53,236 నమూనాలను పరీక్షించామని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 65 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 30, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 28 చొప్పున ఉన్నాయి.