సింగ‌ర్ సునీత వివాహం.. ఆశీర్వదించిన మంత్రి ఎర్రబెల్లి..

275
singer Sunitha
- Advertisement -

ప్రముఖ సింగ‌ర్ సునీత వివాహం నిన్న రాత్రి నిరాడంబ‌రంగా జరిగింది. మ్యాంగోమూవీస్ అధినేత రామ్ వీరపనేనితో ఈమె పెళ్లి జరిగింది. శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లి శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో వీరి వివాహం జ‌రిగింది. సునీత మెడ‌లో రామ్ వీర‌ప‌నేని మూడు ముళ్లు వేశారు. క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో ఈ వేడుక‌కు కొద్ది మంది బంధుమిత్రులు మాత్ర‌మే వ‌చ్చారు. ప‌లువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

ఈ వివాహానికి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. హీరో నితిన్ దంపతులు కూడా వీరి పెళ్లికి హాజరయ్యారు ఈ మధ్యే పెళ్లి చేసుకున్న హీరో నితిన్ – శాలిని లను కూడా ఆశీర్వదించి, అభినందించిన మంత్రి ఎర్రబెల్లి.

- Advertisement -