దేశంలో 24 గంటల్లో 34,703 కరోనా కేసులు..

60
India Corona cases

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 34,703 కరోనా కేసులు నమోదుకాగా 553 మంది మృత్యువాతపడ్డారు.దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,06,19,932కు చేరగా మొత్తం 2,97,52,294 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు.

కరోనాతో ఇప్పటివరకు 4,03,281 మంది మృత్యువాత పడగా జాతీయ రికవరీ రేటు 97.17శాతానికి పెరిగింది. వీక్లీ పాజిటివిటీ రేటు 2.40శాతంగా ఉండగా రోజువారీ పాజిటివిటీ రేటు 2.11శాతానికి పడిపోయింది. ఇప్పటివరకు 42.14 కోట్ల టెస్టులు చేయగా టీకా డ్రైవ్‌లో భాగంగా మొత్తం 35,75,53,612 డోసులు పంపిణీ చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.