తెలంగాణలో కొత్తగా 3,464 కరోనా కేసులు నమోదు..

48
coronavirus

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 65,997 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,464 మందికి కరోనా నిర్ధారణ అయింది. 25 మంది మ‌ర‌ణించారు. రాష్ర్టంలో ప్ర‌స్తుతం 44,395 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 4,801 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో 534 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 243, మేడ్చ‌ల్ జిల్లాలో 219 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

రాష్ట్రంలో ఇప్పటివరకు 5,47,727 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 5,00,247 మంది కోలుకున్నారు. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 91.33 శాతంగా నమోదైంది. జాతీయస్థాయి రికవరీ రేటు 87.2 శాతం అని తాజా బులెటిన్ లో పేర్కొన్నారు.