ఏపీలో కరోనా విజృంభణ.. కొత్తగా 20,937 మందికి పాజిటివ్..

44

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 92,231 కరోనా పరీక్షలు నిర్వహించగా 20,937 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అదే సమయంలో 20,811 మంది కరోనా నుంచి కోలుకోగా, 104 మంది మరణించారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే 15 మంది మృత్యువాతపడ్డారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 3,475 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానంలో ఉన్న చిత్తూరు జిల్లాలో 3,063 కేసులు గుర్తించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 15,42,079 పాజిటివ్ కేసులు నమోదు కాగా…. 13,23,019 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ఇంకా 2,09,156 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 9,904కి పెరిగింది.