ఎంసీఏ @ 3

84
mca

నాచురల్ స్టార్ నాని, సాయిపల్లవి హీరో,హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఎంసీఏ’ (మిడిల్ క్లాస్ అబ్బాయి). శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం ప్రేక్షకుల ముందుకువచ్చింది. రాజీవ్ కనకాల, భూమిక, ఆమని, నరేష్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. నాని కెరీర్‌లోనే హైయస్ట్ వసూళ్లను రాబట్టింది.

నాని మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాడు. తల్లి చిన్నతనంలో చనిపోవడం వల్ల అన్నయ్య (రాజీవ్ కనకాల) అతనికి సర్వస్వం. అన్నయ్య జీవితంలో జ్యోతి (భూమిక చావ్లా) భార్యగా ప్రవేశించడంతో కొంత వారి మధ్య దూరం పెరుగుతుంది. వదిన కారణంగానే అన్నయ్య దూరమయ్యాడనే ఫీలింగ్‌లో ఉంటాడు నాని. ఇంతలో అన్నయ్య ఢిల్లీకి వెళ్లడం, రవాణాశాఖలో పనిచేసే జ్యోతికి వరంగల్ ట్రాన్స్‌ఫర్ కావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో నాని కూడా వదినతో అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ కొన్ని సమస్యల్లో చిక్కుకుంటుంది. ఆ సమస్యల నుంచి భూమికను నాని ఎలా గట్టెక్కించాడు…?అన్నది సినిమా కథ.

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ నాని,సాయిపల్లవి నటన….ఫస్టాఫ్,కామెడీ. నాని తన సహజ నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. ముఖ్యంగా ఓ మిడిల్ క్లాస్ అబ్బాయిలా నాని నటన ఆకట్టుకుంటుంది. ఫిదా ఫేమ్ సాయిపల్లవి సినిమాకు మరో ప్లస్. పల్లవి పాత్రలో అల్లరి, చిలిపి పాత్రలో ఆకట్టుకొంటుంది. ఇక పాటల్లో డ్యాన్సులతో దుమ్ము దులిపేసింది. పోసాని,రాజీవ్ కనకాల,భూమిక,నరేష్,ఆమని తమపరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ప్రియదర్శి కామెడీ సూపర్బ్. డైలాగులు పేలాయి. మధ్య తరగతి కుటుంబంలో ఉండే బంధాలు, అనుబంధాలతో తెరకెక్కిన ఎంసీఏ ప్రేక్షకులను ఆకట్టుకుంది.