మహేశ్ బాబు @ 11

67
mahesh

టాలీవుడ్ సూపర్‌స్టార్‌గా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటుడు మహేష్ బాబు. ఇటీవలె సరిలేరు నీకెవ్వరు సినిమాతో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసిన మహేష్ మరోసారి తనకు ఎవరు సరిలేరనిపించుకున్నారు. తన నటనతో దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న మ‌హేష్ సోషల్ మీడియాలో దక్షిణాదిలో ఏ హీరోకు సాధ్యంకానంత ఫ్యాన్ ఫాలోయింగ్‌తో దూసుకుపోతున్నారు.

ట్విట్టర్‌లో కోటిమంది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న తొలి దక్షిణాది హీరోగా నిలిచిన మహేశ్‌ తాజాగా 11 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్నారు.మహేశ్ తర్వాతి స్ధానంలో తమిళ కథానాయకుడు ధనుష్‌ ఉన్నారు.

తన మనసులోని కృతజ్ఞతాభావాన్ని వివరించి చెప్పడానికి 11 మిలియన్ల ధన్యవాదాలు కూడా సరిపోవు. మీ అందరితో వర్చువల్‌గా ఇలా కనెక్ట్ అయినందుకు నిజంగా చాలా సంతోషిస్తున్నానని పేర్కొన్నారు మహేశ్‌.