26న బంతిపూల జానకి

437
- Advertisement -

రొమాంటిక్‌ కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన ‘బంతిపూల జానకి’ అన్ని వర్గాల ప్రేక్షకులను చక్కగా ఎంటర్‌టైన్‌ చేస్తుందని, సినిమా చూసిన వాళ్ళంతా ‘భలే ఉందని’ మెచ్చుకొంటారని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. ఉజ్వల క్రియేషన్స్‌ పతాకంపై నెల్లుట్ల ప్రవీణ్‌ చందర్‌ దర్శకత్వంలో కళ్యాణి-రామ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26, శుక్రవారం వస్తోంది.

ధన్‌ రాజ్‌, దీక్షాపంథ్‌, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, సుడిగాలి సుధీర్‌, అదుర్స్‌ రఘు, వేణు తదితరులు ‘బంతిపూ జానకి’లో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం విడుదలను పురస్కరించుకుని ఫిలిం చాంబర్ ప్రివ్యూ ధియేటర్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో చిత్ర నిర్మాత రామ్, దర్శకుడు నెల్లుట్ల ప్రవీణ్‌చందర్‌, కథానయకుడు ధన్‌ రాజ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ తేజ, సంగీత దర్శకుడు బోలే, రచయిత శేఖర్‌ విఖ్యాత్‌, ఎడిటర్‌ శివ వై ప్రసాద్‌ తోపాటు ముఖ్య అతిథిగా ప్రముఖ నటులు, సెన్సార్‌ బోర్డ్‌ మెంబర్‌ శివజీరాజా పాల్గొన్నారు.

‘బంతిపూ జానకి’ చిత్రాన్ని చూసిన సెన్సార్‌ బోర్డ్‌ మెంబర్స్‌లో తనూ ఒకడినని, ఈ చిత్రం తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని శివాజీరాజా అన్నారు. ‘పెళ్ళిచూపులు’ సినిమా తరహాలో ‘బంతిపూల జానకి’ కూడా బిగ్‌ సక్సెస్‌ సాధిస్తుందని ఆయన పర్కొన్నారు.

హీరో ధన్‌ రాజ్‌ మాట్లాడుతూ.. ‘బంతిపూల జానకి’ కథను నమ్మి ఈ చిత్రంపై కోటిన్నర ఖర్చు చేసి, మరో అరకోటి ప్రచారం నిమిత్తం ఖర్చు చేస్తున్నారు నిర్మాతలు. శేఖర్‌ విఖ్యాత్‌ సూపర్బ్‌ స్టోరీతోపాటు డైలాగ్స్‌ ఇచ్చాడు. బోలే బ్రహ్మాండమైన మ్యూజిక్‌ చేశారు. శివ చక్కగా ఎడిట్‌ చేశారు. మా ఎగ్జిక్యూట్‌ ప్రొడ్యూసర్‌ తేజ ఎక్స్‌లెంట్‌గా ఎగ్జిక్యూట్‌ చేశారు. వీళ్ళందరికి ‘బంతిపూల జానకి’ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది’ అన్నారు.

- Advertisement -