CMRL కేసు.. చిక్కుల్లో కేరళ సీఎం కుమార్తె!

13
- Advertisement -

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె టీ వీణా విజయన్ చిక్కుల్లో పడ్డారు. ఆమెపై ఆర్థిక నేరానికి సంబంధించిన కేసులో విచారణ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయపరమైన విచారణ కొనసాగించేందుకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది.

కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ అనే ప్రభుత్వరంగ సంస్థ నుంచి టీ వీణా విజయన్‌కు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు నిబంధనలకు విరుద్దంగా నిధులు బదిలీ అయినట్లు తేలింది. SFIO దాఖలు చేసిన 160 పేజీల ఛార్జ్‌షీటు ఆధారంగా విచారణకు కేంద్రం ఆమోదం తెలిపింది.

రూ.1.72 కోట్ల మేర నిధులు బదిలీ అయినట్లు ఆరోపణలురాగా వీణా విజయన్‌తో పాటు సీఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ శశిథర్ కార్తా, మరో 25 మంది వ్యక్తుల పేర్లు నిందితులుగా ఉన్నారు.

Also Read:82 ఏళ్ల వయస్సులో జిమ్..వైరల్ వీడియో!

- Advertisement -