- Advertisement -
సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, ఒక వ్యక్తి మణికట్టు మీద వాలిన దోమ అతనిని కుట్టేందుకు విపరీతంగా ప్రయత్నించింది. కానీ ఎంతకు ఆ ప్రయత్నం ఫలించలేదు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ యూజర్ షేర్ చేయగా నెటిజన్లు తమదైన శైలీలో కామెంట్ చేశారు. ఈ దోమ “ఫ్రెషర్” అంటూ కొంతమంది ఆటపట్టించగా, మరికొందరు “దోమా, నీకు సిగ్గుందా?” అని ట్రోల్ చేస్తున్నారు.
ఇక ఈ వీడియోకి ఆ యూజర్ “మొత్తం దోమల కమ్యూనిటీ కి అవమానం!” అని క్యాప్షన్ పెట్టగా, వీడియోలో “ఫస్ట్ టైమ్ బ్రో” అనే టెక్స్ట్ కూడా జత చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు చచ్చేలా నవ్వుకుంటున్నారు.
पूरा मच्छर समाज शर्मिंदा है! 😂 pic.twitter.com/7XGm0xxexE
— Aditi (@Aditeaaa_) April 2, 2025
Also Read:తెలుగు రాష్ట్రాలు..వెదర్ అప్‌డేట్
- Advertisement -

