సీఎంఆర్ఎఫ్‌కు DICCI 25 లక్షల విరాళం..

455
ktr
- Advertisement -

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపధ్యంలో ముఖ్యమంత్రి తీసుకుంటున్న కరోనా నివారణ చర్యలలో మేము సైతం అంటూ ముందుకొచ్చారు దళిత పారిశ్రామికవేత్తలు. దళిత్ ఇండియన్ ఛాంబర్ అఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (DICCI ) తరపున ఈ రోజు డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ 129వ జన్మదినం పురస్కరించుకుని ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు తోడ్పాటుగా తమవంతుగా ముఖ్యమంత్రి సహాయనిధికి 25 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు దళిత గిరిజన పారిశ్రామిక వేత్తలు.

ktr

కేసీఆర్‌ అలాగే కేటీఆర్‌ రూపొందించిన నూతన పారిశ్రామిక విధానం వల్ల లబ్ది పొందిన తాము పే బ్యాక్ టు సొసైటీలో భాగంగా సమాజానికి తోడుగా నిలవాలని దీనిలో పాలుపంచుకోవాలని ఈ నిర్ణయం తీసుకుని ఈరోజు మున్సిపల్ మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు 25 లక్షల చెక్ ను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్,అందోల్ ఏమ్మెల్యే క్రాంతికిరణ్ మరియు DICCI జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నర్రా రవికుమార్,దక్షిణ భారత ఉపాధ్యక్షుడు చంటి రాహుల్ కిరణ్, రాష్ట్ర అధ్యక్షుడు కత్తెరపక రవికుమార్, సురేష్ నాయక్, మునీందర్ పాల్గొన్నారు.

- Advertisement -