అమెరికాలో కాల్పులు…22 మంది మృతి

33
- Advertisement -

అమెరికాలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. మైనే రాష్ట్రంలోని లెవిస్టన్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 22 మంది మరణించారు. మరో 60 మందికిపైగా గాయపడ్డారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దాడి జరుగగా వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడి ఫోటోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.

ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని…నిందితుడి ఆచూకి తెలపాలని కోరగా ఓ కారులో పరారవుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. గతంలో అతడిపై అనేక కేసులు, పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చినట్లు గుర్తించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

Also Read:Charanraj:’నరకాసుర’ అందరికి నచ్చుతుంది

- Advertisement -