నేటి ముఖ్యమైన వార్తలు..

13
- Advertisement -

()కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ పీవీకి భారతరత్న అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇవాళ అవార్డుల ప్రధానోత్సవం జరుగగా పీవీ కుమారుడు పీవీ ప్రభాకర్ రావు భారత రత్న అవార్డు అందుకున్నారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..పీవీకి భారతరత్న..అందుకున్న పీవీ ప్రభాకర్‌ రావు

()బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో భారీగా పెరిగాయి. ఇవాళ ఒక్కరోజే హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1420 పెరిగి రూ.68,730కి చేరగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.1300 పెరిగి ర63 వేల మార్క్‌గా ఉంది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Gold Rate:బంగారం ధరలివే

()సార్వత్రిక ఎన్నికల ముందు దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కేంద్రంలో మోడీని గద్దె దించేందుకు విపక్షాలన్నీ ఏకమై కూటమిగా ఎన్నికల బరిలో దిగుతుంటే.. బీజేపీ మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ప్రత్యర్థి పార్టీలను దెబ్బ తీస్తోంది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..‘ఇండియా’ సభ రెడీ..మమతా హాజరవుతారా?

()ఐపీఎల్ టైటిల్ కోసం ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్న ఆర్సీబీ ఈసారి ఎలాగైనా కప్పు సాధించాలనే లక్ష్యంతో ఉంది. టైటిల్ నేగ్గే సామర్థ్యం పుష్కలంగా ఉన్నప్పటికి ఆ జట్టుకు మొదటి నుంచి లక్ కలిసి రావడం లేదు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..IPL 2024 :కోహ్లీ పైనే భారమా?

()తొలి సినిమా జయంతోనే యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో నితిన్. ఫస్ట్ సినిమానే సూపర్‌ హిట్‌ కావడంతో ఫుల్ జోష్‌తో వరుస సినిమాలు చేస్తూ యూత్ హీరోగా పేరు తెచ్చుకున్నారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Nithin:హ్యాపీ బర్త్ డే…నితిన్

()కోలీవుడ్ ప్రముఖ నటుడు డానియెల్ బాలాజీ గుండెపోటుతో మృతి చెందారు. ఆయన వయస్సు 48. శుక్రవారం అర్థరాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..గుండెపోటుతో తమిళ నటుడు మృతి

()తిరుపతి కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..TTD:కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు

()ఈ నెల 31న(రేపు) జిల్లాల్లో పర్యటించనున్నారు మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. నీళ్లందక ఎండిపోతున్న పంటపొలాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, కరువుకు అల్లాడుతున్న రైతాంగానికి ధైర్యాన్ని నింపేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లాల పర్యటన చేపట్టనున్నారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..31న జనగామకు కేసీఆర్..

- Advertisement -