గుండెపోటుతో తమిళ నటుడు మృతి

13
- Advertisement -

కోలీవుడ్ ప్రముఖ నటుడు డానియెల్ బాలాజీ గుండెపోటుతో మృతి చెందారు. ఆయన వయస్సు 48. శుక్రవారం అర్థరాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. డానియెల్ మృతితో తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.

ప్రొడక్షన్ మేనేజర్‌గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కమల్ రాఘవన్‌లో సైకో విలన్‌గా భయపెట్టారు. తెలుగు,తమిళ్, కన్నడలో కలిపి 50కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో ఘర్షణ వంటి సినిమాలో మంచి గుర్తింపు వచ్చింది. చివరగా నాని టక్ జగదీష్ సినిమాలో నటించారు. ఛిత్తీ టీవీ సీరియల్‌లో డానియెల్ పాత్ర ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

Also Read:వేసవిలో నోరు పొడిబారితే.. ఇలా చేయండి!

- Advertisement -