TTD:కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు

10
- Advertisement -

తిరుపతి కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 4న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది.ఏప్రిల్ 5న ధ్వజారోహణం, ఏప్రిల్ 9న గ‌రుడ సేవ , ఉగాది పండుగ వస్తున్నందున భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏప్రిల్ 10న హ‌నుమంత వాహ‌నం, ఏప్రిల్ 13వ తేదీన చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. వాహన సేవలు ప్రతి రోజు ఉదయం 8 నుండి 10గంటలవరకు , రాత్రి 7 నుండి 9 గంటల వరకు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 17 నుండి 19వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు, ఏప్రిల్ 21 నుంచి 23వ తేదీ తెప్పోత్సవాలు జరుగనున్నాయి. .

ఆల‌యంలో ఆక‌ట్టుకునేలా పెయింటింగ్స్‌, రంగ‌వ‌ల్లులు తీర్చ‌దిద్దుతున్నారు. రథోత్సవం కోసం రథాన్ని, వాహ‌న సేవల కోసం వాహనాలు ,తండ్ల‌ పటిష్టతను ముంద‌స్తుగా త‌నిఖీ చేపట్టారు. బ్రహ్మోత్సవాల్లో స్వామివారి వాహనసేవల ముందు భక్తులను ఆకట్టుకునేలా భజనలు, కోలాటాలు, ఇతర కళాబృందాల ప్రదర్శనలు ఉండనున్నాయి. భక్తులకు అన్నప్రసాదం పంపిణీ , తాగునీరు, మజ్జిగ అందుబాటులో ఉంచాలని, మెరుగైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Also Read:డియర్..రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -